ఏ2డిజిటల్ న్యూస్, మే 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి చెరుకు సాయికుమార్‌ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్‌ను చెరుకు సాయికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ మాట్లాడుతూ, నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు పటిష్ట కార్యాచరణతో పని చేస్తానని తెలిపారు. ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, కలెక్టరేట్ అధికారులు, నర్సాపూర్ మున్సిపాలిటీ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

