Wednesday, May 6, 2026

నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలో 479 మంది అభ్యర్థులు హాజరుఅభ్యర్థులు హాల్ టికెట్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2 డిజిటల్ న్యూస్, మే 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో మే 3న నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షను ఎలాంటి చిన్న తప్పిదం కూడా లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఒకే పరీక్షా కేంద్రంలో మొత్తం 479 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సెంటర్ సూపరింటెండెంట్ (సి ఎస్), అబ్జర్వర్లు, తహసిల్దార్ స్థాయి అధికారులు, ఎస్సై, ఒక గన్‌మన్, నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ అమలు చేయడంతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, సీసీ కెమెరాలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కల్పించాలని, అభ్యర్థులు సకాలంలో చేరేందుకు ఆర్టీసీ బస్సులు సమయానికి నడపాలని పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సదుపాయాలు, ప్రాథమిక వైద్యం, అంబులెన్స్, ఫైర్ సర్వీసులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు జరుగుతుందని, ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎవరినీ అనుమతించరని స్పష్టం చేశారు.అభ్యర్థులకు సూచనలు:హాల్ టికెట్‌లోని అన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలిసెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గడియారాలు, బ్లూటూత్, బ్యాగులు, కాలిక్యులేటర్లు అనుమతి లేదుఅడ్మిట్ కార్డు, ఫోటో ఐడి ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిమధ్యాహ్నం 1:30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలిమడమలు తక్కువగా ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి (షూస్ నిషేధం)లోహ ఆభరణాలు ధరించకూడదునీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular