ఏ2డిజిటల్ న్యూస్, మే 2,చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ దివ్య లింగం గౌడ్ ప్రారంభించారు. ఫిజికల్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మడూర్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 21వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఈ శిక్షణ రోజు ఉదయం సాయంత్రం జరుపబడుతుందని తెలిపారు. అనంతరం సర్పంచ్ దివ్య లింగం గౌడ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. వేసవి రోజుల్లో ఉదయం సాయంత్రం రెండు పూటలా క్రికెట్ వాలీబాల్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు క్రీడాకారులు సకాలంలో వచ్చి క్రీడలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ కె కిరణ్ కుమార్, సర్పంచ్ దివ్య లింగ గౌడ్ ఉపసర్పంచ్ యువకులు పాల్గొన్నారు.

