–అట్టహాసంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం
ఏ2డిజిటల్ న్యూస్, మే 3, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
అట్టహాసంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు జరిగాయి. మండల పరిధి జంగరాయి గ్రామంలో నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కింద ఇండ్లు మంజూరు కాగా ఇల్లు కట్టుకొని ఆదివారం గ్రామ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలలో ఒక ఇల్లు కూడా నిర్మించలేదని, తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అందుకే నిరుపేదలకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇండ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు మరిన్ని మంజూరికి కృషి చేస్తామని తెలిపారు.రెండో విడత ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ ప్రక్రియలు జరగనున్నాయని తెలిపారు.

