Wednesday, May 6, 2026

చెరువుల కబ్జాను కాపాడేందుకు డిజిటల్ సర్వే

-మొదటి దశగా 606 గుర్తింపు

గూగుల్ మ్యాప్ నక్ష తో చెరువు హద్దులు గుర్తింపు–నీటిపారుదల ఈఈ శ్రీనివాసరావు

ఏ2డిజిటల్ న్యూస్, మే 4,చిన్నశంకరంపేట:(కమ్మరి దేవరాజు)

చిన్న నీటి వనరులు కాపాడేందుకు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన డిజిటల్ కమిటీల ద్వారా సర్వే చేసి ఎఫ్టీఏల్ హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలో 173 చెరువు కుంటలు ఉన్నాయి. మొదటి దశగా 30 చెరువులకు ఎప్టీఎల్ సర్వే చేముటకు అనుమతి లభించింది. చెరువుల సంరక్షణకు అది కాదు సిద్ధమయ్యారు. నీటిమట్టం గుర్తించి హద్దులు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. డిజిటల్ సర్వే నిర్వహించేందుకు ఇప్పటికే మండలంలో చెరువుల లో వెళ్లి సర్వే నిర్వహించెందుకు ప్రణాళిక రూపొందించారు. ఎఫ్ టి ఎల్ కబ్జాలకు తెలపడింది. ఏమైంది చేగుంటతో పాటు పట్టణాలలో అక్రమంగా చెరువులు కబ్జా చేసి భవన నిర్మాణాలు చేపడుతున్న సంఘటనలు ఉన్నాయి ముందుగా మట్టి నింపి తరువాత నిర్మాణాలు చేపట్టిన సంఘటనలు వెల్లులిలోకి వస్తున్నాయి ఈ క్రమంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. *చెరువుల్లో పక్కాగా హద్దులు*మొదటి దశగా గుర్తించిన 66 చెరువులకు డిజిటల్ సర్వే నిర్వహించేందుకు అధికారులతో కూడిన కమిటీలను నియమించారు ఇందులో తాసిల్దార్ రెవెన్యూ సర్వే యార్ ఇరిగేషన్ ఏఈ అడవి శాఖ అధికారులతో కూడిన కమిటీ చెరువులను పరిశీలిస్తుంది. ముందుగా తాసిల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న చెరువు నక్షత్ర పాటు గూగుల్ మ్యాప్ ఆధారంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఎఫ్.టి.ఎల్ కు గురించి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే శాశ్వతంగా చెరిగి పోకుండా హద్దులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.*కబ్జాలు అరి కట్టేందుకే ఏప్టీఎల్ గుర్తింపు సర్వే*మెదక్ జిల్లాలో చిన్న నీటి వనరులు కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామని ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు తెలిపారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా సర్వే చేసి ఎఫ్ టి ఎల్ హద్దులు ఏర్పాటు చేస్తున్నాం దీని ద్వారా చెరువులు కబ్జాలకు గురికాకుండా అరికట్టుతున్నాము. వర్షాకాలంలో చదువులకు నీరు చేరే లోపు మొదటి దశలో 606 చెరువులు ఎఫ్టిఎల్ గురించి గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మండలంలోని చెరువులలో ఇప్పటికే సర్వే చేస్తున్నామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular