ఏ2 డిజిటల్ న్యూస్, మే4, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాoచందర్)
ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రానికి చెందిన టెంపుల్ డాన్స్ కళాకారులు కేరళ రాష్ట్రంలో తమదైన ప్రతిభను కనబరిచి పలువురి ప్రశంసలకు పాత్రులయ్యారు. ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో కేరళ రాజధానితిరువనంతపురంలో కేరళ భాషా సాంస్కృతిక శాఖ, నాదం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో హన్మకొండ కు చెందిన ”ది టెంపుల్ డాన్స్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ” విద్యార్థులు కూచిపూడి విభాగంలో తమదైన ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కూచిపూడి విభాగంలో సీనియర్ కేటగిరీలో అనిశ్రిత, యజ్ఞశ్రీ, సాయిత్రిపురలు ప్రథమ బహుమతి పొందగా, జూనియర్ విభాగంలో ఆరుషి రెడ్డి, చన్విత, వరునికలు ప్రథమ బహుమతి, స్ఫూతినిశ్రీ రెడ్డి, శ్రీనిధి, శ్రీరైఖ్యా రెడ్డి లు ద్వితీయ బహుమతి, సబ్ జూనియర్ విభాగంలో ఆరాధ్య, శ్రీయాంక, శ్రుత కీర్తి ప్రథమ బహుమతి, సత్య కృతి, శ్లోకా రెడ్డిలు ద్వితీయ బహుమతులు పొందారు. వీరు నాట్య చారిని కాట్రగడ్డ హిమాన్షి ఆధ్వర్యంలో బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా నాట్యాచారిని హిమాన్షి మాట్లాడుతూ తమ విద్యార్థులు కేరళలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

