Wednesday, May 6, 2026

రైతులకు మట్టి నమూనా సేకరణ పై అవగాహన –వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్

ఏ2డిజిటల్ న్యూస్, మే4, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

రైతులు రసాయన ఎరువులు తగ్గించి పకృతి వ్యవసాయం వైపు వెళ్లడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్ అన్నారు. రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం రైతు వేదికలో రైతులకు మట్టి నమూనా పై అవగాహన కల్పించారు. రైతులు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటలు పండించాలని సూచించారు. రైతులకు మట్టి నమూనా కొలది పంటలు పండించాలని తెలిపారు. రైతులు నేల పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడాలని అధిక యూరియాకు బదులు నానో ఎరువులు సహజ వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular