ఏ2డిజిటల్ న్యూస్ మే 4 సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు.భూసార పరీక్షల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవ కార్యక్రమాలు మెదక్ జిల్లాలో పలురైతువేదికలలోఘనంగా జరుగుతున్నాయి.సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ కౌడిపల్లి రైతు వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూల మొక్కలు సాగు చేసుకోవాలని సూచించారు. కౌడిపల్లి, చేగుంట, తూప్రాన్ లో కొందరు రైతులు ఆ దిశగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.మెదక్ జిల్లా హైదరాబాద్ కు దగ్గరలో ఉంది కనుక మార్కెట్ చేసుకోవడానికి సులువుగాఉంటుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారోత్సవాలు–2026” కార్యక్రమాన్ని జిల్లాలో మే 04 నుండి మే 09 వరకు అన్నిమండలాలు,గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, క్లస్టర్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రజాభిమానాన్ని పొందేలా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం అత్యవసరమని తెలిపారు. అందుకోసం రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకుని, క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక్క రైతు కూడా మిగలకుండా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికలను కేంద్రబిందువుగా చేసుకుని రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, మండల సర్పంచుల పూర్ణ అధ్యక్షులు కౌడిపల్లి సర్పంచ్ కృష్ణ గౌడ్ స్థానిక వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

