ఏ2డిజిటల్ న్యూస్, మే 4, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజులు మండలంలోని 5 రైతు వేదికలలో రైతు వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేతలు పలు అంశాలను గురించి చర్చించారు ప్రకృతి వ్యవసాయం, వరి పంటలో వచ్చే చీడ పీడ గురించి, మార్కెట్ ప్రేఫరెడ్ వరి రకాల గురించి, సమతుల్య ఎరువుల వినియాగం, మట్టి నమూనా సేకరణ, మట్టి నమూనా కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్ట్ డి ఆర్: బాలాజీనాయక్, డి ఆర్: రాజేంద్ర మరియు ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్. రుద్రమూర్తి కూల్చారం, పోతిరెడ్డిపల్లి, జలల్పూర్, అంశానపల్లి సర్పంచులు, ఉపసర్పంచులు, రైతులు, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, ప్రకృతి వ్యవసాయ కృషి సఖిస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.అలాగే సోమవారం కొంగోడు గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవెత్తలు ప్రోగ్రాంలో భాగంగా డిఆర్: సతీష్ మరియు సిహెచ్ రమ్య శ్రీ పాల్గొని రైతులకు పంటలలో నీటి యాజమాన్యం పద్ధతుల గురించి, పచ్చి రొట్టె ఎరువుల వాడకం, పంట మార్పిడి తదితర అంశాలను గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, రైతులు పాల్గొన్నారు.

