ఏ2డిజిటల్ న్యూస్, మే6, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
నవజాత శిశువును విక్రయం చేసిన కేర్ హాస్పిటల్ పై కేసు నమోదు చేసి,హాస్పిటల్ ను సీజ్ చేయాలని సీపీఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా ఏ ఓ యూనస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి, కార్యదర్శి వర్గ సభ్యులు కె నర్సమ్మ ఏ, మల్లేశం మాట్లాడుతూ శిశువును విక్రయం చేసిన కేర్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి, హాస్పిటల్ను సీజ్ చేయాలని మెదక్ పట్టణంలోని కేర్ హాస్పిటల్లో పుట్టిన శిశువు మృతి చెందిందనితల్లిదండ్రులను మోసం చేసి శిశువును విక్రయం చేసిన కేర్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి, హాస్పిటల్ను సీజ్ చేయాలని సిపిఎం మెదక్ జిల్లా కమిటీ కోరుతుందన్నారు. గత నెల 12వ తేదీన పాపన్నపేట మండలం లక్ష్మినగర్ కు చెందిన నస్రా ఫాతిమా డెలివరీ కోసం మెదక్ పట్టణంలోని కేర్ హాస్పిటల్లో అడ్మిట్అయ్యారు. డెలివరీ వెళ్లిన శిశువు తల్లిదండ్రులకు పుట్టిన శిశువు మరణించిందని చెప్పి కోసం చేయడం జరిగింది. శిశువులను విక్రయించడం బి ఎన్ ఎస్ సెక్షన్ 370, 372, 373 మరియు జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 లోని సెక్షన్ 80, 81 ప్రకారం తీవ్రమైన నేరమని తెలిసినప్పటికీ హాస్పిటల్ యాజమాన్యం శిశువు విక్రయానికి ప్రోత్సాహించడం జరిగింది.ఈ నేరానికి పాల్పడిన వారిపై మరియు ప్రోత్సహించిన హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం కోరుతుందన్నారు.జిల్లాలో శిశువులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెంచాలని సిపిఎం వారు అన్నారు. మెదక్ పట్టణంతో పాటు నర్సాపూర్, తుప్రాన్, చేగుంట, రామాయంపేట, పెద్దశంకరం పేట ప్రాంతాల్లో ఉన్న ప్రయివేట్ హాస్పిటల్పై ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని,జిల్లాలో జరుగుతున్న శిశువు విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం మెదక్ జిల్లా కమిటీ కోరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు జె సంతోష్ పాల్గొన్నారు.

