ఏ2డిజిటల్ న్యూస్, మే 6,సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న )
బుధవారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మాజీ టి పి సి సి కార్యదర్శి , ఎస్ పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ , ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ గాజులరామారం చైర్మన్ సొంటి రెడ్డి పున్నారెడ్డి. ఈ సందర్భంగా సొంటిరెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ… కుత్బుల్లాపూర్ నియోజక వర్గం శ్రీరామ్ నగర్ బి కమిటీ, గుడి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నేడు ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నవాబ్, శ్రీనివాసరెడ్డి కాలనీ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

