Wednesday, May 6, 2026

జిల్లా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2డిజిటల్ న్యూస్, మే6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో కొత్తగా నియమితమైన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు.బుధవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా పరిధిలోని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వ శాఖల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఔట్‌సోర్సింగ్ సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం తో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి హక్కులను తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు.ఉద్యోగుల సంక్షేమంపై నిర్లక్ష్యం చూపే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అటువంటి సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి, వారి బాధ్యతలను ఇతర సంస్థలకు అప్పగిస్తామని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రామరాజు, జిల్లా విద్యాధికారి శ్రీరామ్, శిశు సంక్షేమ శాఖ అధికారి హేమభార్గవి, లేబర్ ఆఫీసర్ తిరుపతి తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular