ఏ2డిజిటల్ న్యూస్, మే 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
పాపన్నపేట మండలం అన్నారం గ్రామ శివారులోని ప్రకృతి వనం వెనుక పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు, సెల్‌ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టైన వారిలో దర్శనం రాజు (32), దర్శనం వినోద్‌కుమార్ (29)లు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.8,500 నగదు, రెండు సెల్‌ఫోన్లు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సమన్వయంతో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.

