ఆరుగురు పట్టివేత.. నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం
ఏ2డిజిటల్ న్యూస్, మే 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జూదం, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు : మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావుమెదక్ జిల్లా కుల్చారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగంపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.రంగంపేట గ్రామ శివారులోని అవుసుల కుంట సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేపట్టారు. ఈ దాడిలో కొమ్ముల రాజాగౌడ్, ఉరేడి సత్యం, అరట్ల సురేష్, నిమ్మనగారి చంద్రారెడ్డి, ఎం.డి. చాంద్ పాషా, అరిగె నర్సింలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.నిందితుల వద్ద నుంచి రూ.4,050 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.జిల్లాలో జూదం, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు.

