Monday, July 6, 2026

రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ

కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులోరవాణాలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు

ఏ2డిజిటల్ న్యూస్, మే 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కొల్చారం మండలంలోని ఫ్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం, సత్యసాయి రైస్‌మిల్లును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్మెదక్, మే 11: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని, ధాన్యం రవాణాలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే అన్లోడింగ్ సమయంలో సమస్యలు తలెత్తకుండా మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ కొల్చారం మండల కేంద్రంలోని ఫ్యాక్స్ వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలు, గన్నీ బ్యాగుల సరఫరా, కేంద్రాలకు కేటాయించిన లారీల రాకపోకలు, ఓపీఎంఎస్ నమోదుల వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొల్చారం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం నుంచి ఇప్పటివరకు 13 లారీల ధాన్యాన్ని సత్యసాయి రైస్‌మిల్లుకు తరలించినట్లు వెల్లడించారు. కేంద్రంలో హమాలీల కొరత లేదని, ధాన్యం తరలింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.సివిల్ సప్లై అధికారులు క్షేత్రస్థాయిలో తరచూ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular