— మండల విద్యాధికారి దీప్లా రాథోడ్, ప్రిన్సిపాల్ వాణికుమారి
ఏ2 డిజిటల్ న్యూస్, మే11, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వ్యక్తి వికాసాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపు నిర్వహించినట్లు మండల విద్యాధికారి భీమ్లా రాథోడ్ అన్నారు.సోమవారంమండల కేంద్రంలోని మాడల్ స్కూల్ లో విద్యా వారోత్సోవాలో భాగంగా వేసవి శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ తోపాటు మండల విద్యాధికారి బీమ్లా రాథోడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వాణికుమారి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం 8నుంచి 12 గంటల వరకు సమ్మర్ క్యాంపు ఈ నెల 11 నుండి 26 వరకు15 రోజులపాటు కొనసాగుతుందన్నారు.వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకే క్యాంపులని, విద్యార్థుల్లో దాగివున్న వెలికి తీసి ఆత్మవిశ్వాసం, పెంపొందించి వ్యక్తిత వికాసం మానసిక ప్రశాంతత కోసం ఎంతోఉపయోగపడతాయన్నారు. యోగా ధ్యానం కళ ప్రతిభలను వెలికి తీసే శిక్షణ శారీరక దృఢత్వాన్ని పెంచే క్రీడా కార్యక్రమాలు తో పాటు డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

