–ఏపీఓ రాములు కు సమ్మె నోటీస్
ఏ 2డిజిటల్ న్యూస్, మే12, చిన్న శంకరంపేట ప్రతినిధి( కమ్మరి దేవరాజు)
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 18 తారీకు నుండి సమ్మెకు దిగుతామని వివో ఏలు అధికారులకు సమ్మె నోటీసు అందించారు. చిన్నశంకరంపేట వివో ఏలు మండల సమైక్య సంఘం అధికారి రాములు కు సమ్మె నోటీసులు అందజేశారు. ప్రభుత్వం తమకు నెలకు 20వేల రూపాయల జీతం. సాధారణ ఆరోగ్య భీమా 20 లక్షల వరకు, ఎస్ ఈ ఆర్ సి, ఉద్యోగులుగా గుర్తించి, హెచ్ఆర్ పాలసీ వర్తింపచేయాలి. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివోఎ లు, నాగరాజు, రాజు, శేఖర్, లత, తదితరులు పాల్గొన్నారు.

