Sunday, July 5, 2026

మార్మోగిన హనుమాన్ ఆలయంలో జయంతి

–హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞ హోమం

ఏ2డిజిటల్ న్యూస్, మే12, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

చిన్నశంకరంపేట మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలలో హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. ఆలయ పూజారి సంతోష్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు యజ్ఞ హోమాలు ఘనంగా జరిగాయి. హనుమాన్ ఆలయం చుట్టూ కాషాయ తోరణాలతో కనుల విందుగా కనిపించింది. చిన్నశంకరంపేట లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమయజ్ఞలు,పంచామృత అభిషేకం, చందనోత్సవం, ఆకు పూజలు వంటి కార్యక్రమాలు ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భజనలు ఆటపాటలతో భక్తుల మధ్య మార్మోగింది. పూజారి సంతోష్ పంతులు ఆధ్వర్యంలో, యజ్ఞం నిర్వహించగా కోడూరి శ్రీనివాస్ గౌడ్ దంపతులు, బెజగం రాజు దంపతులు, దర్జీ రమేష్ దంపతులు, శ్రీధర్ దంపతులు, శశిధర్లు కూర్చున్నారు. కాగా హనుమాన్ జయంతి ఉత్సవం కార్యక్రమాలకు అన్నదాన కార్యక్రమ గ్రహిత వడ్ల వెంకట రాములు జరిపించారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు జరిగింది. ఈ కార్యక్రమంలో వనం నర్సింలు, లచ్చల్ సెట్, మేడి గణేష్, శాంతరాం, దాసు, మల్లికార్జున్, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular