ఏ2డిజిటల్ న్యూస్, మే 13, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న
ధన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.అల్లాదుర్గం మండలం గడి పెద్దాపురం గ్రామంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం రాశులు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లర్లు హమాలీల సంఖ్య ను పెంచి వెంట వెంటనే ధాన్యం అన్ లోడింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లుచేయాలనితెలిపారు.తనిఖీలో తదితరులు పాల్గొన్నారు.

