–బాధిత బాలికకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
ఏ2 డిజిటల్ న్యూస్, మే13, చిన్నశంకరంపేట: (ప్రతినిధి కమ్మరి దేవరాజు)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిన్న శంకరంపేట బిఆర్ఎస్ వి నాయకులు అత్తిలి నాగరాజు, గోపాల్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం చిన్న శంకరంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కేసు దర్యాప్తులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.చట్టం అధికార పార్టీకోలా, సామాన్య ప్రజలకోలా వేర్వేరుగా అమలవుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్వీ నాయకులు అత్తిలి నాగరాజు, గోపాల్ నాయక్, యండి. ఇమ్రాన్,తదితరులు పాల్గొన్నారు.

