ఏ2డిజిటల్ న్యూస్, మే 13, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న )
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని కృష్ణాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఆహ్వానం మేరకు బుధవారం నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..రెండవ విడత ఇందిరమ్మ పిల్లల భాగంగా కొల్చారం మండలాలు ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తానని నిరుపేదలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, నాయకులు చిట్యాల యాదయ్య, ముత్యం గారి సంతోష్ కుమార్, ధనరాజ్, పోల నవీన్, మహేష్ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

