ఏ2డిజిటల్ న్యూస్, మే 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా మెదక్ మండలంలోని మక్త భూపత్‌పూర్ గ్రామంలో ఆనందోత్సాహాల నడుమ నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ కుమార్తె, కుమారుడి పుట్టుపంచల వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఘనంగా సాగాయి. ఈ వేడుకలకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి చిన్నారులు ఉన్నత స్థాయికి చేరుకొని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో శైలేందర్‌తో పాటు నరేష్, సుభాష్, మహిపాల్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొని రాజశేఖర్ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించిన ఈ పుట్టుపంచల వేడుకలు ఆనందభరితంగా కొనసాగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

