Friday, July 3, 2026

మెదక్ జిల్లా చిలప్చెడు మండలంలో రైతులకు ఊరట

కొనుగోలు కేంద్రాలకు ఖాళీ లారీల తరలింపు

ఏ2డిజిటల్ న్యూస్, మే 23, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

మెదక్ జిల్లా చిలప్చెడు మండలంలోని ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తరలింపునకు లారీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.మెదక్–సంగారెడ్డి ప్రధాన రహదారిలోని చండూర్ ఎక్స్ రోడ్ వద్ద చిలప్చెడు తహసిల్దార్ జహీర్, ఎంపీడీవో ప్రశాంత్, పోలీస్ సిబ్బంది కలిసి రహదారిపై వెళ్తున్న ఖాళీ డీసీఎంలు, లారీలను నిలిపివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం అవసరమైన మేరకు వాటిని చిలప్చెడు మండలంలోని ఐకెపి మరియు పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలకు తరలించారు.అధికారుల ఈ చర్యతో కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం త్వరితగతిన తరలింపుకు మార్గం సుగమమైందని రైతులు తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ జహీర్, ఎంపీడీవో ప్రశాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular