ఏ2డిజిటల్ న్యూస్, మే 24, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగలి వెంకటేశం (48) అప్పుల బాధ తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశం గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో చికిత్స కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేని పరిస్థితి రావడంతో కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురై బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వెంకటేశం భార్య రేణుక ఫిర్యాదు మేరకు, ఆమె ఉదయం కూలి పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటేశం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మంగలి కిష్టయ్య ఫోన్ ద్వారా తెలియజేయడంతో ఆమె ఇంటికి చేరుకుని చూడగా వెంకటేశం మృతి చెందినట్లు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహినుద్దీన్ తెలిపారు.

