బయటకు వెళ్ళొద్దంటున్న వాతావరణ శాఖ
ఏ2 డిజిటల్ న్యూస్, మే 25, మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)
ఇప్పటికే ఎండలతో అతలాకుతలమవుతుంటే వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త తెలిపింది. ఈ నెల 29 వరకు సూర్యుడు మరింత మండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి భూపాలపల్లి, ములుగు, భద్రాది, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్, వనపర్తి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు తెలిపారు.

