ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఎస్పీ ఆదేశాలు
ఏ2డిజిటల్ న్యూస్, మే25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ప్రతి ఫిర్యాదుదారునితో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి వేగంగా స్పందించాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. చట్ట ప్రకారం ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని పేర్కొన్నారు.ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, దీంతో ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరుగుతోందని ఎస్పీ తెలిపారు.

