Sunday, July 5, 2026

నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సుడిగాలి పర్యటన

ఏ2డిజిటల్ న్యూస్, మే 25,:సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

చిలిపి చెడు మండలం సోమక్కపేట గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని సూచించారు.వెల్దుర్తి మండలం నుంచి 30 మందిని రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాజన్న ఫౌండేషన్ నిరంతరం సేవలు అందిస్తోందని తెలిపారు.మాసాయిపేట మండలం బొమ్మరం గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలతో కలిసి జాతర ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పులకంటి పెంటయ్య భార్య అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రుస్తుంపేట గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular