కార్యవర్గానికి ఘనంగా సన్మానం
ఏ2డిజిటల్ న్యూస్, మే26, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)
కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు, పెద్దలు, యువత, ప్రముఖుల సమక్షంలో జరిగిన సమావేశంలో సంఘ భవిష్యత్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఏకగ్రీవ నిర్ణయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షులుగా చింతల భాగయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్, క్యాషియర్‌గా కన్నెబోయిన వేణు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా చింతల చంద్రశేఖర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘ అధ్యక్షుడు చింతల భాగయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, సంఘ సభ్యులందరి సహకారంతో ముదిరాజ్ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, విద్యా మరియు సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ఉపాధ్యక్షుడు కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్ మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి చింతల చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ సంఘ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సభ్యుల మధ్య సమన్వయంపెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.క్యాషియర్‌గా ఎన్నికైన కన్నెబోయిన వేణు ముదిరాజ్ మాట్లాడుతూ సంఘ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.అలాగే గ్రామ పెద్దలు మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం గ్రామంలో ఐక్యతకు ప్రతీకగా నిలవాలని, సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు ఉపాధి మరియు విద్యా అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికతో అప్పాజీపల్లి ముదిరాజ్ సంఘంలో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

