Sunday, July 5, 2026

చేనేత కార్మిక పెన్షన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏ2డిజిటల్ న్యూస్ మెదక్ మే 27:సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

మెదక్ జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు,చేనేత, బీడీ కార్మిక, తదితర పెన్షన్ల మంజూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేనేత కార్మిక పెన్షన్లుపొందడానికి (అర్హతలు1) కనీసం 50 సంవత్సరాలు అంతకంటే పైగా వయసు కలిగి ఉండాలి 2) ఆధార్ కార్డు జిరాక్స్ 3) ఓటరు ఐడి కార్డు జిరాక్స్4) రేషన్ కార్డు జిరాక్స్ 5) సంబంధిత చేనేత సహకార సంఘం కార్మిక గుర్తింపు కార్డు జిరాక్స్ 6) మీ సేవ నుండి పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రము ఒరిజినల్ 7) బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ఆయా పత్రాలను గ్రామపంచాయతీ కార్యదర్శులకు లేదా మీ సేవలో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఆయా చేనేత కార్మిక సంఘాల వద్ద నోటీస్ బోర్డ్ పై వివరాల సూచికను అతికించాలని ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే పెన్షన్ల మంజూరు ప్రక్రియ వేగవంతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. పై హరహతలు కలిగి ఉన్న వారుపూర్తి వివరాలకు ఆయా చేనేత సహకార సంఘాల చైర్మన్ లను సంప్రదించగలరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular