— పలుమార్లు చెప్పిన పట్టించుకొని హాస్టల్ వార్డెన్ శివరామ్
—హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చెయ్యాలి
… ఎస్ ఎఫ్ ఐ మెదక్ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్
ఏ2డిజిటల్ న్యూస్, మే 27,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న )
జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో పాములు కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న SC హాస్టల్ లో పాములు కలకలం రేపుతున్నాయి.పలుమార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు. అలాగే డిగ్రీ విద్యార్థులు విద్యార్థులు పరీక్షలు ఉండటం వలన హాస్టలో ఉంటూ చదువుకున్నారు అయిన ఉదయం స్నానం చెయ్యడానికి వెళ్లిన మూత్రవిసర్జన చెయ్యడానికి వెళ్తే బాత్రూంలలో పాములు వస్తున్నాయి.అలాగే హాస్టల్ ఆవరణలో లోకి వస్తున్నాయి అని పలుమార్లు చెప్పిన పట్టించుకోడంలేదు. అలాగే మూత్రశాలలు సరిగా పరిశుభ్రత లేదు.చెప్పిన కూడా పట్టించుకోవడం లేదు వార్డెన్ శివరామ్ను తక్షణమే సస్పెండ్ చెయ్యాలి.ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు గణేష్, చింటూ, విష్ణు, దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.

