రూ.5 కోట్లతో నిర్మాణం తుది దశకు – నాణ్యతపై రాజీ లేదు : కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2 డిజిటల్ న్యూస్, మే 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రాంతంలో, ధ్యాన్‌చంద్ చౌరస్తా సమీపంలో నిర్మాణం తుది దశకు చేరుకున్న ఇందిరా మహిళా శక్తి భవన సముదాయ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ నరసింహులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇంకా మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.మహిళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు మార్కెటింగ్ కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళా సాధికారతకు ఈ భవనం ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.భవన నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్మాణ ప్లాన్లు, గదుల ఏర్పాటు, మౌలిక వసతుల పనులను పరిశీలించిన ఆమె, పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.ఈ పరిశీలనలో పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

