ఏ2డిజిటల్ న్యూస్, మే30, మనోహరాబాద్ ప్రతినిధి (రామకృష్ణ)
గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండలం, కొండాపూర్ గ్రామంలోని ఊరు చెరువు కట్ట బలోపేతానికి ఐటీసీ మైరా సంస్థ ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రామ సర్పంచ్ నూకల రాము అధ్యక్షతన శుభారంభం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవి వెంకటేష్, గ్రామ కార్యదర్శి సంతోష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువు కట్ట బలోపేతం కావడం ద్వారా చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, రైతులకు సాగునీరు సకాలంలో అందుతుందని హర్షం వ్యక్తం చేశారు.అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమం గ్రామ వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన ఐటీసీ మైరా సంస్థకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.”చెరువు బలోపేతం – రైతుకు భరోసా, గ్రామాభివృద్ధికి నాంది” అంటూ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో అభివృద్ధికి కొత్త ఊపును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.

