Sunday, July 5, 2026

టిపిసిసి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ బి ఎల్ ఏ ఎస్ ఎస్ ఏ ల సమీక్ష సమావేశం

ఏ2డిజిటల్ న్యూస్, మే 30,సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టి పి సి సి ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి బి ఎల్ ఏ, ఎస్ ఎస్ ఏ ల సమీక్షా సమావేశం నిర్వహించినారు.ఈ సమావేశంలో మెదక్ మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి,మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు,మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఎస్ ఎస్ ఏ కోఆర్డినేటర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియజరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. బూత్ స్థాయి నుండి పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేలా కార్యాచరణలను రూపొందించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular