Sunday, July 5, 2026

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి– అడిషనల్ కలెక్టర్ నాగేష్

ఏ2డిజిటల్ న్యూస్, మే30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చిలిపిచేడ్, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు లేబర్, హమాలీల సంఖ్యను పెంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ నాగేష్ అధికారులను ఆదేశించారు.శనివారం చిలిపిచేడ్ మండలంలోని గౌతపూర్ గ్రామ శివారులో ఉన్న దక్కన్ ఆగ్రో రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాంను ఆయన సందర్శించి ధాన్యం నిల్వలు, రవాణా, కొనుగోలు ప్రక్రియలను పరిశీలించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నాగేష్ మాట్లాడుతూ, వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని నర్సాపూర్‌లోని రెండు గోదాములకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని దక్కన్ ఆగ్రో గోదాంలోనే నిల్వ ఉంచి బస్తాల ఖాళీ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా అదనపు లేబర్‌ను ఏర్పాటు చేసి, లారీలు మరియు ట్రాక్టర్లలో వచ్చిన ధాన్యాన్ని వెంటనే దింపేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌కు సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సకాలంలో గోదాములకు చేరేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ జహీర్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular