వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక దిశానిర్దేశం
మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పాల్గొన్న ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు


ఏ2డిజిటల్ న్యూస్, మే 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్, మే 30: ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశానికి మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి కేసుల దర్యాప్తు వరకు ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖపై విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.విధుల నిర్వహణలో క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని డీజీపీ తెలిపారు. పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారులు కృషి చేయాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.”ఎస్పీ సమీక్ష సమావేశం”వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గస్తీ నిర్వహణ, డయల్-100 కాల్స్‌పై స్పందన, ఫిర్యాదుల పరిష్కారం, బాధితుల ఇంటి వద్దకే వెళ్లి కేసుల నమోదు వంటి అంశాలపై సమీక్షించారు.రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని, పెండింగ్ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై సమయానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.”కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం”కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి ప్రజల సమస్యలపై స్పందిస్తూ అందుబాటులో ఉండాలని, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.రాష్ట్ర పోలీసు శాఖ ప్రజాసేవల నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఫిర్యాదులు, కేసులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసమే పోలీసు శాఖకు బలమని, ఆ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అధికారులు పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, మహేష్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐ శైలేందర్‌తో పాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

