

నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా అడుగులు
ఉచిత వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్
ఏ2డిజిటల్ న్యూస్, జూన్1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, మెడ్చల్‌కు చెందిన మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు.మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు శిబిరంలో పాల్గొని జిల్లా అధికారులతో పాటు ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, నిరుపేదలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరాం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి. శ్రీనివాస్ శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. శ్రీనివాస్ రావు, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, ఎస్సై సత్యనారాయణ, సభ్యులు శంకర్ దయాళ్ చారి, తోట శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొని రోగులకు సేవలందించారు.

