ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 2, మనోహరాబాద్ ప్రతినిధి (రామకృష్ణ)
మనోహరాబాద్ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం మనోహరాబాద్‌తో పాటు వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను కొనియాడారు. పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు, అభినందన సభలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో వేడుకలు ఉత్సాహభరితంగా సాగడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

