Thursday, July 2, 2026

శివంపేట్ మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 2, శివంపేట ప్రతినిధి (రామకృష్ణ)

శివంపేట్ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం శివంపేట్‌తో పాటు వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, సామాజిక సంస్థల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. గ్రామాల్లో ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా, ప్రజలు ఆనందోత్సాహాల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular