Sunday, July 5, 2026

మెదక్ అర్బన్ ఫారెస్ట్ పార్కులకు పర్యాటక ప్రాచుర్యం కల్పించాలి

జిల్లాలో గ్రీన్ యాక్షన్ ప్లాన్‌కు పటిష్ట ప్రణాళిక

ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని వన్ యోజన అటవీ పార్కులో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 200 మొక్కలతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోహరాబాద్ అర్బన్ ఫారెస్ట్ పార్కులను టూరిస్ట్ హబ్‌లుగా అభివృద్ధి చేసి పర్యాటకులకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే అడవుల సంరక్షణ అత్యవసరమని అన్నారు.జిల్లాలో 24 శాతం అటవీ విస్తీర్ణం ఉందని, విద్యార్థులకు ప్రత్యేక అటవీ పర్యటనలు నిర్వహించి ప్రకృతి, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రత్నాకర్ జోహారి, డీఎఫ్‌వో జోజి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ వేణు, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular