ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 6,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న )
కొల్చారం( 5) మండలంలోని రంగంపేట గ్రామపంచాయతీలో గత 30 సంవత్సరాలకు పైగా వాటర్ మెన్ గా పని చేస్తూ ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తిగా మంచి పేరు సాధించిన పంచాయితీ కార్మికుడు బాలమ్మోల్ల(కొనింటి )వెంకటేశం అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందడంతో రంగంపేట గ్రామంలో పూర్తిస్థాయిలో విషాద ఛాయలు అలుము కొన్నాయి. గ్రామంలో ప్రతి ఇంటి వారితో ఎంతో సమయమనంగా ఉంటూ ప్రతి ఒక్క ఇంటికి సేవ చేసిన వ్యక్తిగా పలకరింపులు ఆప్యాయత, అనురాగం చిరునవ్వుతో పనిచేసే వ్యక్తిత్వం గల వాటర్ మెన్ అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ప్రజలుశోకసంద్రంలో మునిగారు. 30 సంవత్సరాలుగా వాటర్ మెన్ గా ఒకే వ్యక్తి చేయడమనేది జిల్లాలో కూడా 30 సంవత్సరాలు చేసిన వారు ఎవరు కూడా లేదనేది ముమ్మాటికి నిజం అతను చేసిన సేవకు ప్రతి కుటుంబాల వారు నివాళు లు శ్రద్ధాంజలి ఘటిస్తూ కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ వారి కుటుంబానికి తీరని లోటు జరిగిందని వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు అంతేకాకుండా అతని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. గ్రామానికి సేవ చేసే ఇలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని వారన్నారు.

