Sunday, July 5, 2026
Home Blog Page 33

యూరియా అధిక ధరలపై కలెక్టర్ ఆగ్రహం – రంగంపేట ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వరి పంటలను పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారితో కలిసి పొలాల్లో పంట స్థితిని పరిశీలించిన అనంతరం రైతులతో కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండిస్తున్న ప్రతి పంటను ప్రభుత్వ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అలా చేస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందుతాయని తెలిపారు. అక్కడ ఉన్న రైతులు యూరియా ఎరువు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని రంగంపేట, ఎనగండ్ల గ్రామాల్లో కొంతమంది ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలు రెండు రోజుల క్రితం యూరియా బస్తాను రూ.300కి విక్రయించినట్లు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుని యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ శ్రీనివాసాచారికు సమాచారం ఇచ్చారు. సోమవారం రంగంపేటలోని ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారితో కలిసి అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో రిజిస్టర్లలో తప్పులు ఉన్నట్లు గుర్తించినందున కొద్ది రోజులపాటు ఆ ఫర్టిలైజర్ దుకాణాలను మూసివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయాలి – మహిళా సంఘ భవనాన్ని వేరే చోట నిర్మించాలని గ్రామస్తుల వినతి.

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తూ మహిళా సంఘం భవనాన్ని వేరే చోట నిర్మించాలని మండలంలోని పైతర గ్రామస్తులు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మంజూరైన మహిళా సంఘం భవన నిర్మాణానికి తాము అడ్డు కాదని, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అణువుగా ఉన్న ఖాళీ స్థలంలో మహిళా సంఘం భవనం నిర్మించడం ఫ్యూచర్ డెవలప్మెంట్ కు ఇబ్బందికరంగా ఉంటుందని డిపిఓ దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుంటుందని దాంతోపాటు పక్కనే ఉన్న ఖాళీ స్థలంను కలుపుకొని నూతన పంచాయతీ భవనం నిర్మిస్తే బాగుంటుందని తెలిపారు. అందుకు సానుకూలంగా స్పందించిన డిపిఓ యాదయ్య కొల్చారం ఎంపీడీవో రఫీ ఉన్నీసా బేగం కు ఫోన్ చేసి ఫ్యూచర్ భవన నిర్మాణాల కోసం ఆలోచన చేస్తూ గ్రామసభ ద్వారానే పనులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రామసభలు లేకుండా పనులు ఎట్లా చేపడుతారని పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు చూపుతోనే గత ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీ భవనాలు ఇరుకు గదులుగా ఉండకూడదన్న సంకల్పంతో దాదాపు రూ.13 లక్షల వ్యాయంతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా విశాలంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని గ్రామాస్థులు గుర్తు చేశారు. అప్పట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల పనులు చేపట్ట లేకపోయారని, ప్రస్తుతం ఉన్న పంచాయతీ భవనంలోనే పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇరుకుగా మహిళా సంఘం భవనం నిర్మించడం సరైనది కాదని, వేరే చోట నిర్మించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కుమ్మరి భూమయ్య, బోయిని అంతయ్య, బట్ట స్వామి, పుట్టి శివ, మరెళ్లి ప్రభాకర్, ఆకుల కార్తీకరాజు, మాడబోయిన శేఖర్, సాయికుమార్ తదితరులు ఉన్నారు

విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహనసోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చ్ 9 మెదక్ జిల్లా ప్రతినిధి రాము

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్ వంటి సమస్యలపై వివరించి విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వివరించారు. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ల ద్వారా జరిగే మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, ఇతర ఆన్‌లైన్ మోసాలపై ఉదాహరణలతో అవగాహన కల్పించారు.సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచుకోవాలని, బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలను నమ్మవద్దని, ప్రైవసీ సెట్టింగ్స్‌ను సరిగ్గా వినియోగించుకోవాలని తెలిపారు.సైబర్ నేరాలకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే స్పందించాలని సూచించారు. అటువంటి సందర్భాల్లో 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చని వివరించారు.కార్యక్రమం అనంతరం విద్యార్థినుల సందేహాలను తీర్చి సైబర్ నేరాల నివారణపై అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సిబ్బంది సతీష్, సయ్యద్, స్వప్న, కళాశాల సిబ్బంది మరియు సుమారు 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

పంట యాప్ నమోదు పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ యూరియా బస్తాపై అదనంగా రూ.30–40 వసూలు చేస్తున్నారంటూ రైతుల ఫిర్యాదు.

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 9, కుల్చారం ప్రతినిధి పద్మ బిక్షపతి

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో పంట యాప్ నమోదు పనితీరును జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అభివృద్ధి అధికారి శ్వేతాకుమారి నిర్వహిస్తున్న పంట నమోదు ప్రక్రియను కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌కు తమ సమస్యలను వివరించారు. యూరియా బస్తాపై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ.30 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తూ విక్రయాలు చేస్తున్నారని రంగంపేట, యనగండ్ల తదితర గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు రైతులు ఫిర్యాదు చేశారు.రైతుల ఫిర్యాదును గమనించిన కలెక్టర్ ప్రతిమా సింగ్, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 8 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కేంద్ర మంత్రి బండి సంజయ్ తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్యూ అడిషన్ & ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ కార్యక్రమ స్థలాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. సందర్శకులు ఎక్కువగా హాజరయ్యే అవకాశముండటంతో ట్రాఫిక్ నియంత్రణపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అదనపు ఎస్పీ మహేందర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహంలో కృషి విజ్ఞాన కేంద్రాలు కీలకం: బండి సంజయ్.

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 8, జిల్లా ప్రతినిధి:

సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, రైతు వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్, అఖిల భారతీయ కార్యకారిణి సభ్యుడు భాగయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జీవ నియంత్రణ ప్రయోగశాలను పరిశీలించారు. అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్‌ను ప్రారంభించి అక్కడి పరికరాల పనితీరు గురించి తెలుసుకున్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో సాగుచేస్తున్న సేంద్రియ పంటలు, ఉత్పత్తుల ప్రదర్శనను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించి భవిష్యత్తు వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చాకరిమెట్ల హనుమాన్ టెంపుల్ ను దర్శించిన అదనపు ఎస్పీ మహేందర్.

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 8 మెదక్ జిల్లా ప్రతినిధి:

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆదివారం చాకరిమెట్ల హనుమాన్ టెంపుల్ను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూజారులు, ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు అదనపు ఎస్పీ గారికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో శివంపేట్ ఎస్ఐ మధుకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు..

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 8, మెదక్ జిల్లా ప్రతినిధి:

మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హాజరై కేక్ కట్ చేసి మహిళా పోలీస్ సిబ్బందితో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు భద్రత కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కఠిన పరిస్థితుల్లో కూడా మహిళా పోలీసులు ధైర్యంగా విధులు నిర్వర్తిస్తూ శాఖకు మంచి పేరు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. అలాగే మహిళా సిబ్బంది విధుల్లో ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డియస్పి నరేందర్ గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, కౌడిపల్లి ఎస్సై అమర్, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

ప్రభుత్వ కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్, పక్కాగా చేపట్టాలి.

0

రెండో రోజు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు

జిల్లా కలెక్టర్ ప్రతి మా సింగ్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నగేష్, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ సూపరిండెంట్లు రెవిన్యూ సిబ్బందితో కలిసి కార్యాలయ సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండో రోజులో భాగంగా కలెక్టరేట్ లో నిర్వహించిన పరిశుభ్రత ఫైళ్ళ క్రియారెన్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్, వేగంగా పూర్తి చేయాలని హితవు పలికారు.మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వరకు 99 రోజుల కార్యచరణ రూపొందించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లలు భద్రత, వ్యవసాయం, విద్య, యువత, మహిళలు, పర్యావరణం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి దశల వారీగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో, కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, చిన్న సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సెక్షన్ సూపర్ ఇండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల లో గుట్కా అక్రమ నిల్వ ,సరఫరా పై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం

0

ఒకరి అరెస్ట్ , 65,000/- నిషేదిత గుట్కా స్వాధీనం …

ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో గుట్కా పై ప్రత్యేక నిఘా, దాడులు …

వివరాలు వెల్లడించిన సీసీఎస్ సిఐ కిరణ్ …

రూరల్ మండలంలోని సంగంపల్లి,తిప్పన్నపేట కేంద్రంగా గుట్కా నిల్వ చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాలకు , షాపులకు అక్రమంగా సరఫరా చేస్తున్న *పల్లెర్ల జలేందర్* అనే వ్యక్తిని పట్టుకొని ,అతని వద్ద నుండి 65,000/- విలువగల గుట్కా స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు …

ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా గుట్కా అక్రమ నిల్వ ,రవాణా ,సరఫరా మరియు అమ్మకాలపై పూర్తిగా నిఘా ఉంచడం జరిగిందని , గుట్కా వ్యాపారం చేస్తున్న వారి వివరాలు సేకరించడం జరిగిందని త్వరలోనే వారిపై దాడులు చేసి ,గుట్కా అరికట్టడానికి పూర్తి చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు …

ఈ కార్యక్రమంలో సీసీఎస్ సిఐ కిరణ్,ఎస్సై రవీందర్ ,హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు, కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు …