
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలివిధుల్లో క్రమశిక్షణతో వ్యవహరించాలి
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి
చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ఏ2 డిజిటల్ న్యూస్, మే 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ.. దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా సమయపాలనతో విధులు నిర్వహించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలను కూడా ఎస్పీ సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ.. ముఖ్య కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పనిచేసేలా చూడాలని అధికారులకు సూచించారు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.స్టేషన్ రిసెప్షన్‌ను పరిశీలించిన ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న రెమావతిని ఆమె బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా నిలుస్తూ వారి ఫిర్యాదులను సక్రమంగా నమోదు చేయడంలో సహకరించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సహాయం అందించాలని తెలిపారు.అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ.. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సీఐలు సైదా, సందీప్‌రెడ్డి, ఎస్ఐ శివానందం తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



