Sunday, July 5, 2026
Home Blog Page 5

రెడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

0

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఆదేశాలు

ఏ2డిజిటల్ న్యూస్, మే22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రెడ్డిపల్లి డీసీఎంఎస్ మరియు పీఏసీఎస్ పాడి ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లతో పాటు చందాయిపేట్‌లోని శ్రీ శివ కేశవ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ సందర్శించి కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లర్లకు మరియు పీపీసీ కేంద్రాల సిబ్బందికి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అలాగే TAB ఎంట్రీలను ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రవాణా, అన్‌లోడింగ్ మరియు డేటా ఎంట్రీ పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పులిమామిడి గ్రామంలో అభివృద్ధి పనులు

0

శ్రమదానంతో రోడ్ల మరమ్మతులు – ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

ఏ2డిజిటల్ న్యూస్, మే22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ సబిత, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు కలిసి శ్రమదానం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆర్ & బి రోడ్డు వద్ద రామాలయం సమీపంలో మట్టి పనులు చేపట్టి, రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. అలాగే రహదారి సౌకర్యం మెరుగుపడే విధంగా మొరం వేయించారు.గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఇచ్చిన మాట తప్పని చిన్న ఘణపూర్ సర్పంచ్ :మధుసూదన్ రెడ్డి

0

ఏ2 డిజిటల్ న్యూస్, మే20, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థి గా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో భాగంగా మీ ఇంటి మహాలక్ష్మి కి మా ఇంటి చిరు కానుక హామీలోభాగంగా నేడు గ్రామంలో ఆరుగురు లబ్ధిదారులకు 5116 రూపాయలు ఈ కింది వారికి అందజేయడం జరిగింది. ఇచ్చిన హామీని తను పదవిలో ఉన్నంతకాలం సజావుగా కొనసాగిస్తానని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.1. పోతరాజు లక్ష్మి & భాస్కర్ 2. మంద వరలక్ష్మి & శ్రీకాంత్ రాజ్ 3. నాన్నగారి కృష్ణవేణి &సందీప్ 4. తాటి శోభ & వెంకటేశం5. నాగం చిత్ర & నితిన్6. నాన్నగారి అర్చన & హరీష్ తదితరులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అంకమ్మ నర్సింలు, పి ఎ సి ఎస్ చైర్మెన్ మంద నాగయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజబోయిన అశోక్, ఉపాధ్యకుడు దార ప్రకాష్, వార్డ్ మెంబర్ రమావత్ సురేష్, నాగ రమేష్ , నాయి కోటి రమేష్, వడ్ల లక్ష్మీపతి, రంగన్న గారి శ్రీనివాస్ రెడ్డి , రంగన్న గారి నాగార్జున రెడ్డి, కమ్మరి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాంటా – రవాణా ప్రక్రియ వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశాలు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

అకాల వర్షాల పరిస్థితుల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు, కాంటా మరియు రవాణా ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను, మిల్లర్లను ఆదేశించారు.తూప్రాన్ మండలంలోని ఘనపూర్ గ్రామంలో ఉన్న సాయినాథ్ రైస్ మిల్లును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లులో జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్, లోడింగ్ ప్రక్రియలను పరిశీలించి పలు సూచనలు చేశారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, రవాణా కోసం అవసరమైన లేబర్, లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని మిల్లర్లకు సూచించారు. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మిల్లు నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇండ్ల గణన ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితంగా జరగాలి:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 19, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

జనగణన–2027 తొలి విడతలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.మంగళవారం రేగోడ్ మండల కేంద్రంలోని కొత్వాన్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇండ్ల గణన ప్రక్రియను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లతో మాట్లాడిన కలెక్టర్, ఇంటింటి సర్వేను నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్వహించడం వారి ప్రధాన బాధ్యత అని తెలిపారు.మొబైల్ యాప్ ద్వారా స్పష్టమైన మరియు ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. మొదటి దశలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు.ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎండాకాలం దృష్ట్యా ఎన్యూమరేటర్లు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు.అలాగే ప్రజలు కూడా ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు ఎలాంటి దాపరికం లేకుండా సరైన సమాధానాలు ఇవ్వాలని కోరారు. ప్రజలు అందించే ఖచ్చితమైన సమాచారం ద్వారా ప్రభుత్వానికి సరైన గణాంకాలు అందుతాయని తెలిపారు.

నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

0

సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలి – విధుల్లో క్రమశిక్షణ పాటించాలి – రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఏ2 డిజిటల్ న్యూస్, మే 19, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మంగళవారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలను ఎస్పీ సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కూడా పరిశీలించిన ఎస్పీ, ముఖ్య కూడళ్లు మరియు ప్రమాదకర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి శుక్రవారం పోలీసు సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.ఈ తనిఖీలో సీఐలు జాన్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఎస్సై రంజిత్ రెడ్డి తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వేగంగా ధాన్యం కొనుగోలు

0

26,191 మంది రైతుల ఖాతాల్లో రూ.260.03 కోట్లు జమ– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2డిజిటల్ న్యూస్, మే 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అత్యంత వేగంగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 37,072 మంది రైతుల నుంచి 1,85,688.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 26,191 మంది రైతుల ఖాతాల్లో రూ.260.03 కోట్లను నేరుగా జమ చేసినట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు అవసరమైన టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే మిల్లర్లు అన్లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

ముప్పిరెడ్డిపల్లిలో అండర్ గ్రౌండ్ మోరీ పనులకు శంకుస్థాపన

0

ఏ2 డిజిటల్ న్యూస్, మే 18, మనోహరాబాద్ ప్రతినిధి (రామకృష్ణ)

ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో మూడో వార్డులో అండర్ గ్రౌండ్ మోరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజానర్సింహా, ఉప సర్పంచ్ రాంరెడ్డి, పంచాయతీ సెక్రటరీ రమేష్ పాల్గొని పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మోరీ నిర్మాణం చేపడుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సత్యనారాయణ, సలీం, అరుణ్, నాగరాజు, శ్రీకాంత్, జాంగిర్ బాబు తదితరులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కదలని ధాన్యం బస్తాలు లారీల కోసం రోడ్ ఎక్కిన రైతన్నలు

0

17.000 నుంచి 20,000 రూపాయలు ఇస్తేనే లారీ.. ?

అన్నదాతలను ఆగం చేస్తున్న లారీ యూనియన్

ఏ2డిజిటల్ న్యూస్, మే19,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో ఏడు యలు టీ జంక్షన్ వద్ద సోమవారం ఎన్ హెచ్ 765 డి రహదారిపై సుమారు రెండు గంటల పాటు రైతన్నలు లారీల కోసం రాస్తారోకో నిర్వహించారు.రైతుల రాస్తారోకోతో ఎక్కడ నిలిచిపోయిన వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు సుమారు 3500 వడ్ల సంచులు తూకం వేసి ఐదు రోజులు గడుస్తున్నా ఒక్క లారీ కూడా రాకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు లారీలు ఎందుకు రావడం లేదని గ్రామ సర్పంచ్ దయాకర్ గౌడ్ లారీ యూనియన్ వాళ్లను నిలదీస్తే బయట మాకు 15000 రూపాయలు ఇస్తున్నారు మీరు 17000 నుంచి 20000 వేల రూపాయలు మాకు డబ్బులు ఇస్తేనే లారీలు వస్తాయంటూ లారీ యూనియన్ వాళ్లు రైతులకు తెలిపారు రైతుల దగ్గర లారీ యూనియన్ వాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తే అధికారులు ఏం చేస్తున్నారంటూ రైతన్నలు నిలదీశారు. కనీసం తూకం వేసిన వడ్ల సంచులను కూడా రైస్ మిల్లులకు తరలించలేక పోతున్నారని ఈరోజు లారీలు రాకపోతే రేపు వందల మంది రైతులతో కలిసి నేషనల్ హైవే ఎన్ హెచ్765డి రహదారిపై బైఠాయించి రాస్తారో గంటలపాటు నిర్వహిస్తామని అవసరమైతే కేసులు పెట్టిన మేము వెనుకాడమని రైతన్నలు తెలిపారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఎస్ఐ మొహీనుద్దీన్ హుటాహుటిన రైతుల దగ్గరికి వెళ్లి రోడ్డుపై బైఠాయించిన రైతులకు నచ్చజెప్పి లారీలు ఏర్పాటు చేస్తా మని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దయాకర్ మాజీ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు యాదయ్య మహిపాల్ దినేష్ దుర్గయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

రెండు కళ్ళు ను దానం చేసిన తోష శ్రావణ్ కుటుంబీకులు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 18, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

కుటుంబ కలహాలతో పాయిజన్ తీసుకొని నిన్న మరణించిన తోశ శ్రావణ్ కళ్ళను ఆదివారం గాంధీ ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి తన రెండు కళ్ళను దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ …ప్రతి ఒక్కరికి ఈ అవయవ దానంలో అవగాహన కల్పించుకొని మనం మరణించిన గాని మరో నలుగురికి మన ఆర్గాన్స్ తోటి కొత్త జీవితం ఇచ్చేందుకు అందరు కూడా ముందుకు రావాలని ఈరోజు తను చనిపోయిన తన రెండు కాళ్ళను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కి దానం చేసిన శ్రావణ్ కుటుంబానికి కిష్టాపూర్ గ్రామ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం క్షణికావేశ నిర్ణయాలతో తమ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవద్దని అందరికీ తెలియజేస్తూ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటదని సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు కూడా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోయి ప్రాణం తీసుకొని నిన్ను నమ్ముకున్న వాళ్ళను నడిరోడ్లో నిలబెట్టే ఆలోచన నుండి అందరూ కూడా విరమించుకొని తమ జీవితాన్ని సక్రమార్గంలో ఎంచుకొని నలుగురికి ఆదర్శంగా ఉండాలని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ గ్రామ పదవ వార్డు సభ్యుడు తోషా నవీన్ కుమార్ మాజీ వార్డ్ సభ్యులు అరికెల శ్రీనివాస్ అరికెల వసంత ప్రవీణ్ అరికెల ఎగొండ. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు మహేష్ కొల్చారం హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.