ఏ2డిజిటల్ న్యూస్, మే30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) జోనల్ మేనేజర్ మధు, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్రావతి, మేనేజర్ శ్రీవాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) అసిస్టెంట్ డైరెక్టర్ సంగీత తదితర అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ (Land Acquisition) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించి, పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు (RDOలు) మరియు టీజీఐఐసీ (TGIIC) జోనల్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి భూ సేకరణ కీలకమని పేర్కొన్న కలెక్టర్, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


