Sunday, July 5, 2026
Home Blog Page 2

మహిళలు రవాణా రంగంలోకి రావడం మహిళా సాధికారతకు నిదర్శనం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

అజివిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన కింద ఎలక్ట్రిక్ ఆటో పంపిణీ

ఆటో నడిపిన అదనపు కలెక్టర్ నగేష్.. ప్రయాణించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని, వారు రవాణా రంగంలోకి ప్రవేశించడం శుభపరిణామమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ‘ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన (AGEY)’ పథకం కింద మక్తా భూపతిపూర్ గ్రామానికి చెందిన కె. సంధ్యారాణికి రూ. 3,35,000 విలువైన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక పథకం ద్వారా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు రవాణా రంగంలో ఉపాధి కల్పించి, వారి అదనపు ఆదాయానికి ఈ పథకం దోహదపడుతుందని వివరించారు. మక్తా భూపతిపూర్ గ్రామంలో సరైన రవాణా సౌకర్యం లేదనే విషయం తన దృష్టికి రాగానే తక్షణమే స్పందించి ఈ ఎలక్ట్రిక్ ఆటోను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.లబ్ధిదారురాలి ఎంపిక:లబ్ధిదారురాలు సంధ్యారాణి గత రెండేళ్ల క్రితం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోగా, అధికారులు ఆమె దరఖాస్తును పరిశీలించి, అర్హురాలిగా గుర్తించి ఈ ఆటోను కేటాయించారు.ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అధికారుల ప్రయాణం:ఆటో పంపిణీ అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా ఆటో డ్రైవర్ సీట్లో కూర్చొని ఆటోను నడపగా.. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అందులో ప్రయాణికురాలిగా కూర్చొని ప్రయాణించారు. ఉన్నతాధికారులు ఇద్దరూ ఇలా సామాన్యుల్లా ఆటోలో ప్రయాణించడం అక్కడ ఉన్నవారందరినీ విశేషంగా ఆకట్టుకుంది.హాజరైన అధికారులు:ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్‌తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ రావు, అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సరస్వతి, డి.పి.ఎమ్ యాదయ్య, ఎ.పి.ఎమ్ నాగరాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్ అర్బన్ ఫారెస్ట్ పార్కులకు పర్యాటక ప్రాచుర్యం కల్పించాలి

0

జిల్లాలో గ్రీన్ యాక్షన్ ప్లాన్‌కు పటిష్ట ప్రణాళిక

ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని వన్ యోజన అటవీ పార్కులో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 200 మొక్కలతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోహరాబాద్ అర్బన్ ఫారెస్ట్ పార్కులను టూరిస్ట్ హబ్‌లుగా అభివృద్ధి చేసి పర్యాటకులకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే అడవుల సంరక్షణ అత్యవసరమని అన్నారు.జిల్లాలో 24 శాతం అటవీ విస్తీర్ణం ఉందని, విద్యార్థులకు ప్రత్యేక అటవీ పర్యటనలు నిర్వహించి ప్రకృతి, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రత్నాకర్ జోహారి, డీఎఫ్‌వో జోజి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ వేణు, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

శివంపేట్ మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు

0

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 2, శివంపేట ప్రతినిధి (రామకృష్ణ)

శివంపేట్ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం శివంపేట్‌తో పాటు వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, సామాజిక సంస్థల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. గ్రామాల్లో ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా, ప్రజలు ఆనందోత్సాహాల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.

మనోహరాబాద్ మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

0

ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 2, మనోహరాబాద్ ప్రతినిధి (రామకృష్ణ)

మనోహరాబాద్ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం మనోహరాబాద్‌తో పాటు వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను కొనియాడారు. పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు, అభినందన సభలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో వేడుకలు ఉత్సాహభరితంగా సాగడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

వ్యవసాయ అధికారిపై ఆగ్రహంవ్యక్తం చేసిన తహసిల్దార్

0

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 2,సీనియర్ జర్నలిస్ట్( బుచ్చన్న)

స్థానిక కొల్చారం మండల వ్యవసాయ అధికారిని శ్వేతా కుమారి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తాసిల్దార్ శ్రీనివాసచారి. ఈ సందర్భంగా వారు తాసిల్దార్ కార్యాలయంలో ఏవో శ్వేత తాసిల్దార్ శ్రీనివాస్ చారి ముఖముఖిగా మాట్లాడుతూ..స్థానిక మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసే విషయాన్ని మండల తాసిల్దారు అయినా తనకు తెలపకుండా తనిఖీ చేయడమే పొరపాటు అంతేకాకుండా వ్యవసాయ శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారి వచ్చిన సమయంలో తాను కూడా పాల్గొన్నట్లు మీడియాకు తెల్పడం ఎంతవరకు సమంజసం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని ఈ సంఘటననుఏవో ఇష్టా రీతికే వదిలేస్తున్నట్లు ఆయన మండిపడ్డారు. ఒకపక్క తాసిల్దార్ జరిగిన సంఘటనపై ప్రశ్నిస్తుంటే తనకేదో అత్యవసర పని ఉన్నట్లుగా ఎమ్మార్వో కార్యాలయం నుండి వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసం అనేది గమనార్హం ఇకనుండి ఇలాంటి కార్యకలాపాలకు తమ కిందిస్థాయి అధికారులు ఎవరు పాల్పడితే విధిగా చర్యలు తీసుకోవాల్సింది ఉంటుందని తాసిల్దార్ శ్రీనివాస్ చారి మీడియాతో తెలిపారు.

ప్రయోగాల దర్శకున్ని వరించిన కళానంది

0

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 2, (ప్రత్యేక ప్రతినిధి మల్పర్తి రాంచందర్)

తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాల దర్శకులుగా పేరుపొందిన డాక్టర్ పిసి ఆదిత్యను కళానంది అవార్డు వరించింది. ఆదిత్య కూడా రంగస్థలం నుండి సినీ రంగానికి వచ్చిన వారే.విద్యార్థి దశలో జంధ్యాల గారి ఏక్ దిన్ కా సుల్తాన్, పరుచూరి బ్రదర్స్ నాన్నా పులి, గణేష్ పాత్రో కొడుకు పుట్టాలా, ఆదివిష్ణు గారి వంద నోటు లాంటి ఎన్నో నాటికల్లో నటించి, అనంతరం సొంతం గా నాటికలు రచించి, దర్శకత్వం వహించి, నటించారు. ఈ స్ఫూర్తి తో సినీ రంగం లో అడుగు పెట్టి పలు ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ఇంకా దర్శకుడు గా తన ప్రయాణం సాగిస్తున్నారు. ఈ అనుభవాన్ని గుర్తించి హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో సీనియర్ దర్శకులురేలంగినరసింహారావు, వకులాభరణం కృష్ణ మోహన్ ఫౌండేషన్ అధినేత మాదాల నాగూర్ బాబు దర్శకులు పీసీ ఆదిత్య కళానంది అవార్డు అందజేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పీసీ ఆదిత్య స్పందిస్తూ తన సినీ విజయాలకు మూలమైన రంగస్థలం ని ఎప్పటికి మరిచిపోనని అన్నారు. ఆదిత్యకు అభిమానులు మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

మెదక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆరోగ్య సేవలు ప్రశంసనీయం

0

నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా అడుగులు

ఉచిత వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్

ఏ2డిజిటల్ న్యూస్, జూన్1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, మెడ్చల్‌కు చెందిన మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు.మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు శిబిరంలో పాల్గొని జిల్లా అధికారులతో పాటు ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, నిరుపేదలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరాం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి. శ్రీనివాస్ శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. శ్రీనివాస్ రావు, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, ఎస్సై సత్యనారాయణ, సభ్యులు శంకర్ దయాళ్ చారి, తోట శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొని రోగులకు సేవలందించారు.

నిష్పక్షపాత విధులే పోలీసుల లక్ష్యం: రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్

0

వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక దిశానిర్దేశం

మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పాల్గొన్న ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2డిజిటల్ న్యూస్, మే 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్, మే 30: ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశానికి మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి కేసుల దర్యాప్తు వరకు ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖపై విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.విధుల నిర్వహణలో క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని డీజీపీ తెలిపారు. పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారులు కృషి చేయాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.”ఎస్పీ సమీక్ష సమావేశం”వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గస్తీ నిర్వహణ, డయల్-100 కాల్స్‌పై స్పందన, ఫిర్యాదుల పరిష్కారం, బాధితుల ఇంటి వద్దకే వెళ్లి కేసుల నమోదు వంటి అంశాలపై సమీక్షించారు.రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని, పెండింగ్ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై సమయానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.”కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం”కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి ప్రజల సమస్యలపై స్పందిస్తూ అందుబాటులో ఉండాలని, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.రాష్ట్ర పోలీసు శాఖ ప్రజాసేవల నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఫిర్యాదులు, కేసులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసమే పోలీసు శాఖకు బలమని, ఆ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అధికారులు పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, మహేష్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐ శైలేందర్‌తో పాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి– అడిషనల్ కలెక్టర్ నాగేష్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చిలిపిచేడ్, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు లేబర్, హమాలీల సంఖ్యను పెంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ నాగేష్ అధికారులను ఆదేశించారు.శనివారం చిలిపిచేడ్ మండలంలోని గౌతపూర్ గ్రామ శివారులో ఉన్న దక్కన్ ఆగ్రో రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాంను ఆయన సందర్శించి ధాన్యం నిల్వలు, రవాణా, కొనుగోలు ప్రక్రియలను పరిశీలించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నాగేష్ మాట్లాడుతూ, వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని నర్సాపూర్‌లోని రెండు గోదాములకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని దక్కన్ ఆగ్రో గోదాంలోనే నిల్వ ఉంచి బస్తాల ఖాళీ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా అదనపు లేబర్‌ను ఏర్పాటు చేసి, లారీలు మరియు ట్రాక్టర్లలో వచ్చిన ధాన్యాన్ని వెంటనే దింపేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌కు సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సకాలంలో గోదాములకు చేరేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ జహీర్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మెదక్ పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యం– జిల్లా కలెక్టర్

0

ఏ2 డిజిటల్ న్యూస్, మే 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలోని పురాతన పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా టూరిజం శాఖ సమన్వయంతో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.శనివారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో మెదక్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మీర్ ఖాన్, ఈడీఎం సందీప్, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్‌లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఈడీఎం, యువజన క్రీడల శాఖ అధికారులు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి వాటి పరిస్థితులను పరిశీలించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన అనుభవాలు, సూచనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన సౌకర్యాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. టూరిజం అధికారులు, డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి పర్యాటక శోభను మరింత పెంపొందిస్తామని కలెక్టర్ వెల్లడించారు.అంతకుముందు మెదక్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల చారిత్రక విశిష్టత, వారసత్వ ఆనవాళ్లకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఈడీఎం సందీప్ జిల్లా కలెక్టర్‌కు వివరంగా సమర్పించారు.ఈ కార్యక్రమంలో డీపీఆర్‌వో రామచంద్రరాజు, డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.