ఏ 2 టీవీ న్యూస్ మార్చ్ 9 మెదక్ జిల్లా ప్రతినిధి రాము
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్ వంటి సమస్యలపై వివరించి విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వివరించారు. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ల ద్వారా జరిగే మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, ఇతర ఆన్‌లైన్ మోసాలపై ఉదాహరణలతో అవగాహన కల్పించారు.సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచుకోవాలని, బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలను నమ్మవద్దని, ప్రైవసీ సెట్టింగ్స్‌ను సరిగ్గా వినియోగించుకోవాలని తెలిపారు.సైబర్ నేరాలకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే స్పందించాలని సూచించారు. అటువంటి సందర్భాల్లో 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చని వివరించారు.కార్యక్రమం అనంతరం విద్యార్థినుల సందేహాలను తీర్చి సైబర్ నేరాల నివారణపై అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సిబ్బంది సతీష్, సయ్యద్, స్వప్న, కళాశాల సిబ్బంది మరియు సుమారు 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.














