ఏ2టీవీ న్యూస్,మార్చి14 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)


మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో 99 రోజుల పరిపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామాభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో జెసిబి యంత్రాలతో పనులు నిర్వహిస్తూ వాడలు, కాల్వలు మరియు రహదారులను శుభ్రం చేయిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని వార్డుల్లో శుభ్రత పనులు క్రమంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.






















