Sunday, July 5, 2026
Home Blog Page 7

ఆహ్వానం మేరకు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 13, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న )

నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని కృష్ణాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఆహ్వానం మేరకు బుధవారం నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..రెండవ విడత ఇందిరమ్మ పిల్లల భాగంగా కొల్చారం మండలాలు ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తానని నిరుపేదలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, నాయకులు చిట్యాల యాదయ్య, ముత్యం గారి సంతోష్ కుమార్, ధనరాజ్, పోల నవీన్, మహేష్ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే13, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేతలు ప్రోగ్రామ్ కొల్చారం మండలంలోని పైతర, పోతిరెడ్డిపల్లి, నాయిని జలల్పూర్ గ్రామలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేతలు పలు అంశాలను గురించి చర్చించారు ప్రకృతి వ్యవసాయం, వరి కోయలను కాల్చడం వలన జరిగే నష్టం,వరి పంటలో వచ్చే చీడ పీడ గురించి, మార్కెట్ ప్రేఫరెడ్ వరి విత్తన రకాలగురించి, సమతుల్య ఎరువుల వినియాగం, మట్టి నమూనా సేకరణ గురించి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ పి సతీష్ , డాక్టర్ త్రివేణి, ఆకుల బేబీ, డాక్టర్ సైదా నాయక్, బి రాకేష్ సర్పంచులు , ఉపసర్పంచు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి పాల్గొన్నారు.

బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి.

0

–బాధిత బాలికకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్

ఏ2 డిజిటల్ న్యూస్, మే13, చిన్నశంకరంపేట: (ప్రతినిధి కమ్మరి దేవరాజు)

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిన్న శంకరంపేట బిఆర్ఎస్ వి నాయకులు అత్తిలి నాగరాజు, గోపాల్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం చిన్న శంకరంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కేసు దర్యాప్తులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.చట్టం అధికార పార్టీకోలా, సామాన్య ప్రజలకోలా వేర్వేరుగా అమలవుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్వీ నాయకులు అత్తిలి నాగరాజు, గోపాల్ నాయక్, యండి. ఇమ్రాన్,తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 13, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న

ధన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.అల్లాదుర్గం మండలం గడి పెద్దాపురం గ్రామంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం రాశులు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లర్లు హమాలీల సంఖ్య ను పెంచి వెంట వెంటనే ధాన్యం అన్ లోడింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లుచేయాలనితెలిపారు.తనిఖీలో తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో వినతులు స్వీకరించిన ఎస్పీ

0

బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2డిజిటల్ న్యూస్, మే13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కు వినిపించారు. కార్యక్రమంలో ప్రతి ఫిర్యాదుదారునితో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు.అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి వేగంగా స్పందించాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ప్రజలు నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్ట ప్రకారం ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని పేర్కొన్నారు.ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, దీనివల్ల ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరుగుతోందని ఎస్పీ తెలిపారు.

ప్రశాంతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో బక్రీద్ పండుగను ఆనందోత్సాహాలతో పాటు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బక్రీద్ పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సమాజంలో సౌభ్రాతృత్వం, ప్రేమ, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్ర పండుగ బక్రీద్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని సూచించారు. బక్రీద్ పండుగ త్యాగానికి, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. పేదలకు సహాయం చేయడం, అవసరమైన వారికి తోడ్పాటు అందించడం ద్వారా పండుగ సార్ధకమవుతుందని అన్నారు.జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా మసీదులు, ప్రార్థనా స్థలాలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి పండుగను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట స్వామి, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం నామినేషన్

0

ఏ2 డిజిటల్ న్యూస్, మే12, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

మంగళవారం మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ముత్తిగళ్ళ రామచంద్రం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సమావేశానికి టిపిసిసి ఎస్సీ సెల్ అబ్జర్వర్ భద్రయ్య, హాజరు కావడం జరిగింది. అదేవిధంగా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆఫీస్ మల్సప్, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిర్జాపల్లి మాజీ సర్పంచ్ పోతరాజు జనార్దన్, చిన్నశంకరంపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కాడి కళ్ళ మల్లేశం,కర్నే సాయిలు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, గడ్డం ప్రభాకర్, జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది

మార్మోగిన హనుమాన్ ఆలయంలో జయంతి

0

–హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞ హోమం

ఏ2డిజిటల్ న్యూస్, మే12, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

చిన్నశంకరంపేట మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలలో హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. ఆలయ పూజారి సంతోష్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు యజ్ఞ హోమాలు ఘనంగా జరిగాయి. హనుమాన్ ఆలయం చుట్టూ కాషాయ తోరణాలతో కనుల విందుగా కనిపించింది. చిన్నశంకరంపేట లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమయజ్ఞలు,పంచామృత అభిషేకం, చందనోత్సవం, ఆకు పూజలు వంటి కార్యక్రమాలు ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భజనలు ఆటపాటలతో భక్తుల మధ్య మార్మోగింది. పూజారి సంతోష్ పంతులు ఆధ్వర్యంలో, యజ్ఞం నిర్వహించగా కోడూరి శ్రీనివాస్ గౌడ్ దంపతులు, బెజగం రాజు దంపతులు, దర్జీ రమేష్ దంపతులు, శ్రీధర్ దంపతులు, శశిధర్లు కూర్చున్నారు. కాగా హనుమాన్ జయంతి ఉత్సవం కార్యక్రమాలకు అన్నదాన కార్యక్రమ గ్రహిత వడ్ల వెంకట రాములు జరిపించారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు జరిగింది. ఈ కార్యక్రమంలో వనం నర్సింలు, లచ్చల్ సెట్, మేడి గణేష్, శాంతరాం, దాసు, మల్లికార్జున్, తదితరులు ఉన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామన్న వివో ఏలు

0

–ఏపీఓ రాములు కు సమ్మె నోటీస్

ఏ 2డిజిటల్ న్యూస్, మే12, చిన్న శంకరంపేట ప్రతినిధి( కమ్మరి దేవరాజు)

రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 18 తారీకు నుండి సమ్మెకు దిగుతామని వివో ఏలు అధికారులకు సమ్మె నోటీసు అందించారు. చిన్నశంకరంపేట వివో ఏలు మండల సమైక్య సంఘం అధికారి రాములు కు సమ్మె నోటీసులు అందజేశారు. ప్రభుత్వం తమకు నెలకు 20వేల రూపాయల జీతం. సాధారణ ఆరోగ్య భీమా 20 లక్షల వరకు, ఎస్ ఈ ఆర్ సి, ఉద్యోగులుగా గుర్తించి, హెచ్ఆర్ పాలసీ వర్తింపచేయాలి. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివోఎ లు, నాగరాజు, రాజు, శేఖర్, లత, తదితరులు పాల్గొన్నారు.

విద్యా వారోత్సవాలను ప్రారంభం

0

— మండల విద్యాధికారి దీప్లా రాథోడ్, ప్రిన్సిపాల్ వాణికుమారి

ఏ2 డిజిటల్ న్యూస్, మే11, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వ్యక్తి వికాసాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపు నిర్వహించినట్లు మండల విద్యాధికారి భీమ్లా రాథోడ్ అన్నారు.సోమవారంమండల కేంద్రంలోని మాడల్ స్కూల్ లో విద్యా వారోత్సోవాలో భాగంగా వేసవి శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ తోపాటు మండల విద్యాధికారి బీమ్లా రాథోడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వాణికుమారి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం 8నుంచి 12 గంటల వరకు సమ్మర్ క్యాంపు ఈ నెల 11 నుండి 26 వరకు15 రోజులపాటు కొనసాగుతుందన్నారు.వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకే క్యాంపులని, విద్యార్థుల్లో దాగివున్న వెలికి తీసి ఆత్మవిశ్వాసం, పెంపొందించి వ్యక్తిత వికాసం మానసిక ప్రశాంతత కోసం ఎంతోఉపయోగపడతాయన్నారు. యోగా ధ్యానం కళ ప్రతిభలను వెలికి తీసే  శిక్షణ శారీరక దృఢత్వాన్ని పెంచే క్రీడా కార్యక్రమాలు తో పాటు డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.