కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా మాజీ చైర్మన్ జంగర్ల గోవర్ధన్
ఏ2 డిజిటల్ న్యూస్, మే11, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మే 12 న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మంగళవారం నిర్వహించబడుతోందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ మాజీ చైర్మన్ జంగర్ల గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకు పెట్టింది పేరని జిల్లా చైర్మన్ కు ఎవ్వరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ మైనంపల్లి హన్మంత్ రావ్ ,మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరు కూడా పాల్గొంటారని, జిల్లా చైర్మన్ కావాలనుకునేవారు వారి బయోడేటాతో పాటు దరఖాస్తులను చేతికి అందజేయలని గోవర్ధన్ తెలిపారు.
ఏ 2 డిజిటల్ న్యూస్, మే11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు నిర్వహించిన తొలి దశ జనగణన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్‌లో పాల్గొన్నారు. ఇంటింటి సందర్శన ద్వారా ప్రజలకు జనగణనపై అవగాహన కల్పించారు. అనంతరం జనగణన ట్యాబ్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశంలో చాలా సంవత్సరాల తర్వాత జనగణన నిర్వహిస్తున్నామని తెలిపారు. 2021లో జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం నిర్వహిస్తున్న ఇది 16వ జనగణన కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి జనగణన అని పేర్కొన్నారు. తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు వెల్లడించారు.స్వీయ గణన విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టడం ద్వారా జనగణన ప్రక్రియలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కుటుంబ వివరాలను ప్రజలే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఇందులో 34 ప్రశ్నలు ఉండగా, కేవలం ఐదు నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.సోమవారం నుంచి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందించామని చెప్పారు. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేశామని, అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు.జనగణన పేరుతో అనుమానిత వ్యక్తులు వివరాలు అడిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారిక సిబ్బందికి జారీ చేసిన ఐడీ కార్డులపై క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తాయని తెలిపారు.జనగణన ప్రక్రియ దేశాభివృద్ధికి ఎంతో కీలకమని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావడం బాధ్యతగా భావించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్ రావు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులోరవాణాలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు
ఏ2డిజిటల్ న్యూస్, మే 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
కొల్చారం మండలంలోని ఫ్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం, సత్యసాయి రైస్‌మిల్లును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్మెదక్, మే 11: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని, ధాన్యం రవాణాలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే అన్లోడింగ్ సమయంలో సమస్యలు తలెత్తకుండా మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ కొల్చారం మండల కేంద్రంలోని ఫ్యాక్స్ వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలు, గన్నీ బ్యాగుల సరఫరా, కేంద్రాలకు కేటాయించిన లారీల రాకపోకలు, ఓపీఎంఎస్ నమోదుల వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొల్చారం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం నుంచి ఇప్పటివరకు 13 లారీల ధాన్యాన్ని సత్యసాయి రైస్‌మిల్లుకు తరలించినట్లు వెల్లడించారు. కేంద్రంలో హమాలీల కొరత లేదని, ధాన్యం తరలింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.సివిల్ సప్లై అధికారులు క్షేత్రస్థాయిలో తరచూ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-అదనపు కలెక్టర్ నాగేష్ కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
ఏ 2 డిజిటల్ న్యూస్, మే11, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన వరి ధాన్యం బస్తాలతో నిలిచిపోయాయని రైతులు వడిగాపులు కాస్తున్నారన్నారు. వార్త ఏ2 డిజిటల్ న్యూస్ లో వచ్చింది.దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ నాగేష్ లారీలను సూరారం, అంబాజీపేట, గజగట్లపల్లి, తదితర గ్రామాలకు పంపారు. దీంతో 15 రోజుల కింద కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై తూకంతో నిండిపోగా, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తూకం వేసిన ధాన్యం సంచులను లారీల్లోకి లోడింగ్ చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ అదనపు కలెక్టర్ నాగేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏ 2 డిజిటల్ న్యూస్, మే11, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
సంగాయిపల్లి గ్రామంలో తండ్రిలేని నిరుపేద వధువు వేముల అఖిల వివాహాని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ వధువు వివాహానికి పుస్తే మట్టెలు పంపగా ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రం, గ్రామ సర్పంచ్ గంగాధర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొల్ల లక్ష్మీ రాజు, వార్డు మెంబర్లు తోట కృష్ణ, కర్నె కుమార్, మాజీ ఉపసర్పంచ్ కర్నే సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
ఏ2డిజిటల్ న్యూస్, మే10, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో లబ్ధిదారుల ఆహ్వానం మేరకుఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి, భూమి పూజ చేసి ఇంకా పుట్టిన తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన సర్థన మల్లమ్మ, యాదగిరి ల కు ఇల్లు మంజూరు కావడం తో ఆదివారం గ్రామస్థులతో కలిసి ఘనంగా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో నాయకులు అంబాజీ రావ్, దత్తు రావ్,టేక్మాల్ మల్లప్ప, టేక్మాల్ సిద్దప్ప, రామయ్య, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏ2డిజిటల్ న్యూస్, మే 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జూదం, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు : మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావుమెదక్ జిల్లా కుల్చారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగంపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.రంగంపేట గ్రామ శివారులోని అవుసుల కుంట సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేపట్టారు. ఈ దాడిలో కొమ్ముల రాజాగౌడ్, ఉరేడి సత్యం, అరట్ల సురేష్, నిమ్మనగారి చంద్రారెడ్డి, ఎం.డి. చాంద్ పాషా, అరిగె నర్సింలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.నిందితుల వద్ద నుంచి రూ.4,050 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.జిల్లాలో జూదం, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు.
ప్రభుత్వం రైతు పక్షపాతి : ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
ఏ2డిజిటల్ న్యూస్, మే9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్: రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వ్యవసాయ, సివిల్ సప్లై, మార్కెటింగ్, రవాణా, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ధాన్యం తరలింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల వద్ద హమాలీల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ధాన్యం తరలింపులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో వివరించాలని అధికారులను ప్రశ్నించారు.రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఒక రైతు పెట్రోల్ బాటిల్‌తో నిరసనకు దిగిన ఘటనకు బాధ్యులు ఎవరో చెప్పాలని నిలదీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు.తమది రైతు ప్రభుత్వమని, రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు ఎన్నుకుని పంపిన ప్రజాప్రతినిధిగా వారి సమస్యలపై ఎవరినైనా ప్రశ్నిస్తానన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణను సజావుగా నిర్వహిస్తామని తెలిపారు. హమాలీల సమస్యను త్వరలోనే పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. నాలుగు నుంచి ఐదు రోజుల్లో రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని వివరించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధికా భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏ2 డిజిటల్ న్యూస్, మే9, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని హంసానిపల్లి గ్రామ పిఎసిఎస్ పాలకవర్గం ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా మన్నే రాములు, వైస్ చైర్మన్ గా గంగాపురం నర్సాగౌడ్, పాలకవర్గ సభ్యులుగా గడ్డం మీద సత్యనారాయణ కన్నేబోయిన రమేష్ దోమకొండ సంజీవులు బండ భూమయ్య గంగాపురం జనార్దన్ గౌడ్ గొల్లపల్లి దుర్గమ్మ లంబాడి దేవ్ సింగ్ నీరుడి వెంకమ్మ లంబాడి ఆంబోర్య డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ సీఈఓ ఆంజనేయులు, సిబ్బంది వారిని శాలువాల తో సన్మానించారు.
ఏ2 డిజిటల్ న్యూస్, మే9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సెన్సెస్–2027 తొలి దశలో భాగంగా మే 11 నుంచి ప్రారంభం కానున్న ఇండ్ల గణనపై గ్రామస్థులకు అవగాహన కల్పించినట్లు చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని సూచించారు. ఇండ్ల గణనకు ప్రభుత్వ పథకాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.ఆధార్ కార్డు నంబర్ లేదా ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం ఇంటి నంబర్ మరియు ఇంటికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ భూమేష్, సర్పంచ్ నర్సింహా, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.