Thursday, May 7, 2026
Home Blog Page 11

జిల్లాలో 7 రోజుల సంక్షేమ వారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

0

వసతి గృహాల్లో రోజువారీ కార్యక్రమాలకు పటిష్ట ప్రణాళిక

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో 7 రోజులపాటు నిర్వహించనున్న సంక్షేమ వారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎంపీడీవోలు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్‌సీఓలతో కలిసి కార్యక్రమాల అమలుపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వారాన్ని పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను స్పష్టంగా రూపొందించి అమలు చేయాలని సూచించారు.జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు మరియు వసతి గృహాల్లో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులను చేపట్టాలని, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల కోసం క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ వంటి పోటీలు నిర్వహించాలని సూచించారు.ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి వసతులపై చర్చించాలని తెలిపారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.ఇందిరమ్మ గృహప్రవేశాలు మరియు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాలు కూడా సంక్షేమ వారంలో భాగంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గాలి దుమారం రాళ్ల వర్షం –నేలకు రాలిన మామిడికాయలు –రోడ్డుపై విరిగిన చెట్లు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

ఆదివారం కురిసిన అకాల వర్షానికి చిన్న శంకరంపేట మండలంలో రాళ్ల వర్షం కురిసింది. దీంతో రైతన్నలు ఆగమవుతున్నారు. ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండి మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఒక్కసారి చల్లబడి మేఘావృతమై వర్షం వస్తుంది. పంట కోత దశలో ఉండగా రైతులు ఆందోళన లో ఉండిపోయారు. ఇప్పటికే కోతకు వచ్చిన వరి ధాన్యం కోసి కొనుగోలు కేంద్రాల వద్ద ఆడబోసిన ధాన్యం తడిసింది మామిడి తోటలో మామిడికాయలు మొక్కజొన్న పంట ఈదురుగాళ్లకు కిందపడిపోయింది దీంతో రైతులు నష్టం వాటిల్లింది అకాల వర్షం రైతులకు కన్నీరే మిగులుతుంది

హెల్మెట్ పెట్టుకొని ఉంటే మా నాన్న బతికేవారు.

0

–భావోద్వేగానికి గురైన ఎస్సై సృజన

–హెల్మెట్ లేకుంటే జరిమానా

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19 చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

నో హెల్మెట్ నో ఎంట్రీ నినాదంతో వల్లభాపూర్ గ్రామాన్ని రోడ్డు భద్రతలో మాడల్ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా ఎస్సై బీమరి సృజన సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, మాజీ జెడ్పీటిసి బాణాపురం కృష్ణ గౌడ్ హాజరయ్యారు. వాహనదాలకు 80 హెల్మెట్లను అందించారు. ఎస్సై భీమరి సృజన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ఎస్సై సృజన భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కట్ట తడిపెట్టారు. ఆరోజు మా తడి హెల్మెట్ ధరించి ఉంటే కనీసం గాయాలతోనైనా బతికి తమ కళ్ళ ముందు ఉండేవారని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. సీఐ వెంకట రాజా గౌడ్, జాతీయ రహదారి సంస్థ పోగ్రామ్ ఎగ్జిక్యూటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్లినా తప్పనిసరి హెల్మెట్తో వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలని వాహనదాలకు సూచించారు.

నర్సాపూర్ సాహితీ గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ పట్టణంలోని సాహితీ గ్యాస్ ఏజెన్సీపై రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ మరియు సివిల్ సప్లైస్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమాలు వెలుగులోకి తెచ్చారు. ఈ విషయాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు.తనిఖీల సందర్భంగా గృహ వినియోగానికి సరఫరా చేయాల్సిన గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీ గోదాం ద్వారా పంపిణీ చేయకుండా, ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి అనధికారికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇది నిబంధనలకు విరుద్ధమైన చర్యగా గుర్తించి సంబంధిత సాహితీ గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా నిత్యానంద్ మాట్లాడుతూ, ఇలాంటి అక్రమ నిల్వలు మరియు అనధికారిక విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయించినట్లయితే కేసులు నమోదు చేసి, అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు సాహితీ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణను తాత్కాలికంగా ద్వారకా గ్యాస్ ఏజెన్సీ, నర్సాపూర్‌కు కస్టడీగా అప్పగించినట్లు వెల్లడించారు.

రుద్రారం మాజీ సర్పంచ్ కి రాష్ట్రస్థాయి దళిత రత్న అవార్డు.–సేవే మార్గం… గుర్తింపు గమ్యం

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్135వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతి లో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి దళిత అవార్డుల కార్యక్రమంలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఈ అవార్డు దక్కగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ , జిల్లా ఎస్పీ దేవి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడంతో దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మూత్తి గళ్ళ రామచంద్రం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి మాదిగ చిన్నశంకరంపేట దళిత సంఘాల నాయకులు దొంత దుర్గపతి, నాగరాజు, జంగర్ల గోవర్ధన్, కాడిగళ్ళ మల్లేశం, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రవీణ్ మృతి పార్టీకి తీరని లోటు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సునీత రెడ్డి నాయకులు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19,నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

మెదక్ జిల్లా కొల్చారం మండలం కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నేత ముత్యం ప్రవీణ్ కుమార్అకాల మృతి చెందడం జరిగింది.శనివారం ఆయన దశదినకర్మ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… బి ఆర్ ఎస్ పార్టీలోమంచి పేరున్న నాయకుడు , చురుకైన వ్యక్తి ముత్యం ప్రవీణ్ కుమార్ ఆయన లేని లోటు పార్టీ నాయకులను తనను కలచివేస్తుందని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ముత్యం లాంటి ప్రవీణ్ కుమార్ మృతి చాలా బాధాకరమని మరొకసారి అశ్రు నయానాలతో బాధను, దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు,మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, తాజా మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ నాయకులుసంతోష్ రెడ్డి,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పైతర గ్రామ సర్పంచ్ రవితేజ రెడ్డి, కోనాపూర్ గ్రామ సర్పంచ్ మోతుకు నిర్మల మల్లేశం, నాయకులు కరెంటు రాజా గౌడ్, దుర్గం గౌడ్, పాండ్ర వెంకటేశం, తదితరులు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

ముగిసిన మొదటి దశ వార్డ్ మెంబర్ల శిక్షణ

0

ఏ2టీవీ న్యూస్,ఏప్రిల్ 18, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

చిన్నశంకరంపేట మండలంలోని గత నాలుగు రోజుల నుండి 15 గ్రామ పంచాయతీల కు చెందిన వార్డ్ మెంబర్లకు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ శిక్షణకు ట్రైనింగ్ అధికారులు మాసాయిపేట కుమార్, శ్రీకాంత్, అశోక్, వార్డ్ మెంబర్లకు శిక్షణ ఇచ్చారు శనివారం శిక్షణ కార్యక్రమం ముగిసిన అనంతరం ఎంపీడీవో దామోదర్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్ని రిజిస్టర్లు ఉంటాయి, రికార్డులు, గ్రామసభలు, గ్రామాభివృద్ధికి తీర్మానాలు వంటివి ఉంటాయని వీటిని వార్డ్ మెంబర్లు తెలుసుకొని గ్రామపంచాయతీని ముందుకు నడపాలని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని సూచించారు.

ముత్యం ప్రవీణ్ అన్నకు ఘన నివాళులు

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18,నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

ఈనెల ఏడో తారీఖున అనారోగ్యంతో మృతి చెందిన కొల్చారం మండల కేంద్రానికి చెందిన ముత్యం ప్రవీణ్ దశదినకర్మకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో నర్సాపూర్ తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసిన సందర్భంలో వారి ఆధ్వర్యంలో కొల్చారం మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి రాజకీయ ఓనమాలు నేర్చుకోవడం జరిగింది ఆట్టి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని వారి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈరోజు మన మధ్యన లేకున్నా ముత్యం ప్రవీణ్ అన్న కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎప్పుడు గుర్తుంటాయని కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటదని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి కౌడిపల్లి గ్రామ సర్పంచ్ కోదండం కృష్ణ గౌడ్ అప్పాజీపల్లి గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజిని మెదక్ వ్యాపారవేత్త కరణ్ గుప్తా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కామారం గ్రామంలో పోలీసులు బైక్ ర్యాలీ

0

–ఆదర్శ గ్రామం కామారం –వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18, చిన్న శంకరంపేట ప్రతినిధి( కమ్మరి దేవరాజు)

రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా శనివారం కామారం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, స్థానిక ఎస్సై నారాయణ గౌడ్, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకరమని, ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇక్కడ రోడ్లు పెద్దగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్, కారు సీట్ బెల్ట్ పెట్టుకుని, తమ ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం సుజాత ఉపసర్పంచ్ గడిల సుధాకర్ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమగు మందులను అందుబాటులో ఉంచుకోవాలని –జిల్లా వైద్యాధికారి శ్రీరామ్

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18,చిన్నశంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలలో వడదెబ్బ నివారణ, టీబీ నిర్వహణ కొరకు అవగాహన సదస్సులు కల్పించాలని వైద్యాధికారి సాయి సింధుకు సూచించారు. ఆరోగ్య కేంద్రంలో సరిపడ్డ మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో రికార్డులు రిజిస్టర్లు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేనెల 15వ తేదీ వరకు ఈ అవగాహన సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించాలని వైద్య అధికారికి సాయి సింధుకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ యాదగిరిరావు, ఎం ఎల్ హెచ్ పి సూపర్వైజర్ బుజ్జి, నర్సింగ్ ఆఫీసర్ అనిత, ల్యాబ్ టెక్నీషియన్ నర్సింలు, రజిత, కొమురయ్య పాల్గొన్నారు.